వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన డి ఎం అండ్ హెచ్ ఓ

        కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

హైదరాబాద్,సూర్యాపేట (ఆరోగ్యజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్  కోటా చలం మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కి పలు సూచనలు ఇచ్చారు .జిల్లాలో వ్యాధి పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు కోవిడ్ పరీక్షలను నిర్వహించాలన్నారు. అర్హులైన వారందరికీ ఇవ్వాలని టీకాల పై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు అపోహలను తొలగించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వైద్య ఆరోగ్య పథకాలను ప్రజల్లో కి తీసుకు వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కెసిఆర్ కిట్టు పథకం అమలు చేసే విధంగా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మాతాశిశు సంరక్షణ కోసం ఆసుపత్రిలో ప్రసూతి అయ్యే విధంగా చూడాలని, పిల్లలకు గర్భిణీలకు వ్యాధినిరోధక టీకాలు క్రమం తప్పకుండా ఇవ్వాలని శిశు మరణాలు తగ్గించేలా చూడాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు అయిన రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులను తక్షణమే గుర్తించి ప్రతి ఒక్కరికి చికిత్సలు అందజేయాలన్నారు. ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి సిబ్బంది కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిమాండన్ సుదర్శన్ , ఆరోగ్య, విస్తరణ అధికారి బి. భాస్కర్ రాజు మంత్రి ని కలిసినారు.