జైనథ్,(ఆరోగ్యజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం నాడు విజయ రాష్ట్ర చైర్మన్ లోక భూమారెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభించారు. ముందుగా పి ఏ సి ఎస్ చైర్మన్ బాలురి గోవర్దన్ రెడ్డి తొలి టికా తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయ రాష్ట్ర చైర్మన్ లోక భూమారెడ్డి ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ ఎం శ్రీకాంత్ మాట్లాడుతూ కోవిడ్ టికా మండల వాసులకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు .అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాను తీసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. కరోనా వ్యాక్షిన్ పై ఉన్న అపోహలను ప్రజలు నమ్మవద్దని ఈ సందర్భంగా వారు తెలిపారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్షిన్ తీసుకున్న వారికి ఎలాంటి దుష్ఫలితాలు రాలేదని సూచించారు. ప్రస్తుత సమయంలోకరోన వ్యాపిస్తుందని ప్రజలు అవసరమున్నా అంటేనే బయటకు వెళ్లారని తెలిపారు .బయటకు వెళ్లే ముందు ముఖానికి మాస్క్ ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారిశెట్టి గోవర్ధన్, జెడ్ పి టి సి అరుంధతి, ఆర్ఎస్ఎస్ లింగారెడ్డి, డైరెక్టర్ కరుణాకర్ ,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి ,గ్రామ సర్పంచ్ దేవన్న ఎంపీటీసీ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు