సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

         కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

వరంగల్,(ఆరోగ్యజ్యోతి): ఎం.జి.ఎం. హాస్పిటల్, వరంగల్ కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ , ఉద్యోగులు సానిటేషన్, సెక్యూరిటీ పేషెంట్ కేర్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనిడిమాండ్ చేస్తూ ఎం.జి.ఎం హాస్పిటల్ వద్ద గత ఆరు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారు చేస్తున్న దీక్షలకు మద్దతుగా వారితో కలిసి వరంగల్ అర్బన్ రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది.ఈయనతో పాటు దీక్షలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, టిపిసిసి కార్యదార్శి బి. అశోక్ రెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ ఆయుబ్, జిల్లా ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, మాజీ కార్పో రేటర్ తోట వెంకటేశ్వర్లు, డివిజన్ అద్యక్షుడు గన్నారపు సంగీత్ కుమార్, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ దీక్షలో కూర్చున్నారు.  ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మధ్యలో కాంటాక్ట్ విధానం లేకుండా నేరుగా ప్రభుత్వమే కాంట్రాక్ట్ పద్ధతిలో వేతనాలు చెల్లించాలని మధ్య భక్తులను తొలగించాలని వారు కోరారు. కాంటాక్ట్ లో ఉండడం వల్ల ఇంతవరకు బిఎఫ్ ఈ ఎస్ ఐ బకాయిలు కూడా చెల్లించలేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కందికొండ చిన్న రాజు, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల కార్తీక్, నగర కాంగ్రెస్ కార్యదర్శులు జన్ను పృథ్వి, మహేష్, NSUI జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లకొండ సతీష్, యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ సెక్రటరీ మహమ్మద్ జామీరుద్దిన్ రాహుల్, శివ, బాలు కార్మిక ఐక్య వేదిక సంఘ నాయకులు తుల శంకర్, నమిండ్ల సుమన్, సింగారపు ప్రశాంత్, మహేష్, ప్రభాకర్, మంజుల, ప్రభావతి, కోమల తదితరులు పాల్గొన్నారు.