లిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

ఇబ్రహీంపట్నం,(ఆరోగ్యజ్యోతి): లైఫ్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (లిమ్స్) ప్రైవేటు ఆసుపత్రి ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఆసుపత్రి ముందు ఉండాలన్నారు. ఆసుపత్రిలో కి వచ్చే పేదలకు సరైన వైద్యం అందించి ఆస్పత్రికి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి,చైర్పర్సన్ కప్పరి స్రవంతి,మంచాల ఎం పి పి   నర్మదా ,వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మండల పార్టీ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి,చీరాల రమేష్ ,జిల్లా సర్పంచ్ ల అధ్యక్షులు బూడిద రాంరెడ్డి ,కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఎం పి టి సిలు తదితరులు పాల్గొన్నారు.