న్యూ షాంపేట్ యుపిహెచ్ సి లో సెకండ్ డోస్

      కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి): పట్టణంలోని న్యూ శాయంపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ' సెకండ్ డోస్ ' కోవిషీల్డ్ టిక వేశారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు డాక్టర్ మౌనిక, డాక్టర్ విష్ణు ప్రియ దర్శిని మాట్లాడుతూ మొదటిసారి కోవిషీల్డ్ టిక తీసుకున్న సిబ్బంది అందరూ రెండోసారి తీసుకోవాలన్నారు. కోవిషీల్డ్ టిక తీసుకునేందుకు భయపడవలసిన అవసరం లేదన్నారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సీబందీ , పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో కోవిషీల్డ్ టికను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ సునీత, ల్యాబ్ టెక్నీషియన్ మార్క రాజేష్,ఏ.ఎన్.ఎమ్.లు వరలక్ష్మి, ఎలిషా, సువర్ణ, ఆశ వర్కర్స్ న్యూ శాయంపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ హెల్పర్స్  తదితరులు పాల్గొన్నారు.