కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
జిల్లా వైద్య
ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితాదేవి
వరంగల్ అర్బన్,(ఆరోగ్య
జ్యోతి): కరోన వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎలాంటి నిర్లక్ష్యం
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె లలితాదేవి పేర్కొన్నారు. జిల్లా వైద్య
ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో శనివారం నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ,ఈ సందర్భంగా
ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తూ కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య
పెరుగుతుందని సూచించారు, వైద్య అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజల్లో
అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మాస్కులు తప్పకుండా ధరించాలని సూచించారన్నారు,
సామాజిక దూరం పాటించి ఫంక్షన్లకు హాజరైనప్పుడు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు
తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు, జిల్లాలో కరోనా
మొదటి 13288 లైన్ వర్కర్స్ కి ఇవ్వడం జరిగిందని తెలిపారు .ఎన్ సి డి కార్యక్రమంలో భాగంగా రక్తపోటు మధుమేహం క్యాన్సర్
వ్యాధులు గుర్తింపు కోసం ఇంటింటి సర్వే ఆన్లైన్ నమోదు చేయాలని తెలిపారు. ఆరోగ్య
కార్యకర్తలు విలేజ్ రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. జిల్లాకు సొంత భవన నిర్మాణం
కోసం 69 సబ్ సెంటర్ కేంద్రాల కోసం స్థల సేకరణ రెవెన్యూ అధికారులతో కలిసి పూర్తి
చేయాలన్నారు .ఆసుపత్రి ప్రసవాలు పెంచాలన్నారు కుటుంబనియంత్రణ, టీవీ, కీటక జనిత
వ్యాధుల, ఆసుపత్రి అభివృద్ధి నిధులు నిధులు వినియోగంపై పి ఎస్ సి ల వారీగా సమీక్ష
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ టి మదన్మోహన్ రావ్, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఎండి యాకుబ్ పాష,
, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ గీతాలక్ష్మి, ఎం సి డి ప్రోగ్రాం అధికారి
డాక్టర్ సి ఉమా, సర్విలేన్స్ జిల్లా
అధికారి డాక్టర్ శ్రీ కృష్ణ రావు, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి ,ప్రసన్న
కుమార్ ,చంద్రశేఖర్ ,మాధవరెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పట్టణ ప్రాథమిక ఆరోగ్య
కేంద్ర వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.