ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో సంఘ ముందు ఉంటుంది

        కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

- యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బూర రవి  

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ 1926/98 టిఆర్ఎస్ కేవీ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ యన్ హెచ్ యం శానిటేషన్ పెషెంట్ కెర్ సెంట్రల్ ఫోరమ్ అధ్వర్యంలో బస్తీ దవఖాన, UPC,PHC,లో పనిచేస్తున్న ఉద్యోగులు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ యన్ హెచ్ యం ఎంప్లాయిస్ పోరములో ఆదివారంనాడు చేరినారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బూర రవి  మాట్లాడుతూ తెలంగాణ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏర్పడి ఇటీవల 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో సంఘ ముందు ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు అన్ని ఈ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని ఇటీవల యుపిఎస్సీ పి ఎస్ సి లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు విడతలవారీగా అన్ని సిబ్బంది సంఘాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాబర్ట్ బ్రూస్, కన్వీనర్ జాక్ డా పుట్ల శ్రీనివాస్, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ యన్ హెచ్ యం చైర్మన్ షాఖీర్ బాబ, బస్తీ దవాఖానా ఉద్యోగులు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్యవర్గం ఎన్నిక :

బస్తీ దవాఖానా లో పనిచేస్తున్న ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గమును ఎన్ను కోవటము జరిగిందని .ఈ కార్యక్రమము రాష్ట్ర యూనియన్ ఆఫిస్ కోఠి హైదరాబాద్ లో జరిగింది. అనంతరం బస్తీ దవాఖాన ల ఉద్యోగుల కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని  స్టేట్ ప్రెసిడెంట్ గా అమ్జాద్ అలీ ఖాన్ ,స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రమేష్ ,స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ గా హారిక, వైస్ ప్రెసిడెంట్ గా యాదయ్య, జనరల్ సెక్రెటరీగా నరసింహారెడ్డి, స్టేట్ ట్రెజరర్ తులసి రామ్, వైస్ ప్రెసిడెంట్ గా రవి చంద్ర గౌడ్ ,సెక్రెటరీగా నరసింహ, వెంకటేశ్వర్లు, అంబికా, సాయి కృష్ణ, శ్రీనివాస్, చంద్రిక లు ఎన్నుకోబడ్డారు అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాలకృష్ణ, శాంతమ్మ, ప్రదీప్ ,భాను, సుమన్ ఎన్నుకున్నట్లు రాష్ట్ర సంఘం అధ్యక్షులు బుర్ర రవి తెలిపారు.