కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
కోరుట్ల,(ఆరోగ్య జ్యోతి): కోరుట్ల పట్టణంలో ని పట్టణ ఆరోగ్య కేంద్రానికి చెందిన సిబ్బంది ఆదివారం నాడు వనభోజనానికి వెళ్ళినారు భోజనం చేసే సమయంలో ఒక నెమలి నడవలేని స్థితిలో ఉండడం వల్ల ఆ నెమలి ఆ సిబ్బంది పట్టుకున్నారు వెంటనే సంబంధిత అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు సమాచారం ఇచ్చిన వెంటనే అటవీశాఖ సిబ్బంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయ తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన జాతీయ పక్షి అని దానిని కాపాడే బాధ్యత మనందరిపై ఉందన్నారు వనభోజనానికి వెళ్ళి తమకు నెమలి నడవలేని స్థితిలో అనారోగ్యంగా ఉన్నట్లు కనిపించిందని వెంటనే దాన్ని పట్టుకొని ఫారెస్ట్ అధికారులకు అప్పగించడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ రేణుక, ఆరోగ్య కార్యకర్తలు గాండ్ల మధురిమ, కె. సౌజన్య, ఎస్. శారద, టి. రజిత భాయి, టి రజిత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.