కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
కోరుట్ల,(ఆరోగ్యజ్యోతి): కోరుట్ల లోని అల్లమయ్యగుట్ట పట్టణ ఆరోగ్య కేంద్రంలో సోమవారం
రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ను
కోరుట్ల పట్టణంలో ప్రైవేటు ఆస్పత్రి వైద్యులకు వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్
ఇవ్వడం జరిగిందని, వైద్య అధికారులు డాక్టర్ సమీనా తబస్సం, డాక్టర్ అశోక్ బాబు లు తెలిపినారు. దాదాపు 47 మంది కి వ్యాక్సిన్ ఇవ్వడం
జరిగింది ఇందులో 13 మంది ప్రైవేటు డాక్టర్స్ వ్యాక్సిన్ తీసుకున్నారు.వ్యాక్సిన్
తీసుకున్న ప్రైవేటు వైద్యులలో డాక్టర్ మహదేవ్, డాక్టర్ విజయ్
కుమార్ ,డాక్టర్ రమేష్, డాక్టర్ ఒడ్నాల
నరేష్, డాక్టర్ అర్చన ,డాక్టర్ ప్రియాంక
,డాక్టర్ హర్షిత, డాక్టర్ శివ
కుమార్ ,డాక్టర్ పసునూరి మనోజ్,డాక్టర్ హర్ష రాణి ,డాక్టర్ సత్య సాయి మౌనిక ,డాక్టర్ సాయి కిరణ్, డాక్టర్ దీక్షిత తీసుకున్నారుఈ సందర్భంగా వారు
మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి రియాక్షన్స్ కానీ వ్యాధులు
కానీ దరిచేరవని వారు తెలిపారు. కరోన వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే రియాక్షన్
వస్తుందని ప్రజల్లో అపోహలు ఉన్నాయని వాటిని ఎవరు నమ్మవద్దన్నారు. రాష్ట్రవ్యాప్తంగా
జనవరి 16 నుండి వ్యాక్సిన్ ప్రారంభమైందని అప్పటినుండి ఇప్పటివరకు తెలంగాణ
రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకున్న వైద్య ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ సిబ్బందికి
మున్సిపల్ సిబ్బందికి పోలీసు శాఖ వారికి ఎలాంటి అపాయం కాని ఇబ్బందులు కానీ
జరగలేవని వారు తెలిపినారు.మొదటి విడతలో కోవిడ్
వ్యాక్సినేషన్ తీసుకొన్నవారు, రెండో విడత తీసుకున్నట్లయితే వ్యాక్సిన్ పని
చేయాదాని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి రామ్మోహన్, స్టాఫ్ నర్స్ రేణుక, ఆరోగ్య కార్యకర్తలు మదురిమ, రజిత, సౌజన్య, శారద, రజిత బయఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.