యునాని వైద్య విధానానికి సుదీర్ఘ చరిత్ర ఉంది

        కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

ఉప  ముఖ్యమంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): యునాని వైద్య విధానానికి ఒక ఆకర్షణీయమైన, సుదీర్ఘ చరిత్ర ఉందని  ఉప ముఖ్యమంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. ఏడవ ప్రపంచ యునాని దినోత్సవాన్ని పురస్కరించుకొని 20వ ఉమా ఎక్సెలెన్స్ అవార్డ్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని యునాని మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అవార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని డియా ప్లస్ ఆడిటోరియం లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ యునాని వైద్యం ప్రాచీన కాలం నుంచి వచ్చిందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో ఎంతో కీలకపాత్ర వహించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 11 వ శతాబ్ద కాలంలో అరబ్బులు పర్షియన్ ల చే ఇది భారతదేశంలో ప్రవేశపెట్టబడిన అని తెలిపారు. ఈ రోజు యునాని వైద్య విధానంలో అన్ని రకాల వ్యాధులు నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని సూచించారు. యునాని వైద్యం ప్రపంచ అగ్రగామి దేశాల్లో చూసినట్లయితే భారతదేశం ఒకటిగా ఉందన్నారు. యునాని వైద్యం పై భారతదేశంలో లో అనేక పరిశోధనలు జరుగుతున్నాయని ee సందర్భంగా అయన తెలిపారు. అలాగే భారతదేశంలో ఆరోగ్య పరిరక్షణ సంస్థలు కూడా యునాని వైద్యం కలిగి ఉందని గుర్తుచేశారు. ప్రాచీన వైద్యవిధానం అంటే గుర్తుకొచ్చేది ఆయుర్వేదం తో పాటు యునాని అని తెలిపారు. అనేక రకాల వ్యాధులు చికిత్స అందించడంలో యునాని లో అద్భుతమైన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.. అనంతరం లకు వైద్య సిబ్బందికి అవార్డులు పంపిణీ చేశారు కరోన  వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషించిన వైద్యులు వైద్య సిబ్బందికి ఆయన అవార్డును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హైదర్ శకేన్,  డాక్టర్ వికార హైదర్, డాక్టర్ ఈశాన్  ఫరూకి, డాక్టర్ బడురోద్దిన్ , డాక్టర్ సయ్యద్ జలాలుద్దీన్, డాక్టర్ మహమ్మద్ షఫీక్, డాక్టర్ వకీల్ కురోషి  తదితరులు పాల్గొన్నారు