రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

కోరుట్ల,(ఆరోగ్యజ్యోతి): కోరుట్ల లోని అల్లమయ్యగుట్ట పట్టణ ఆరోగ్య కేంద్రంలో సోమవారంనాడు రెండో విడత కోవిడ్  వ్యాక్సినేషన్ చేసినట్లు వైద్య అధికారులు డాక్టర్ సమీనా తబస్సం, డాక్టర్ అశోక్ బాబు తెలిపారు. రెండవ విడత కరోన వ్యాక్సినేషన్ లో భాగంగా సోమవారం నాడు అల్లమయ్యగుట్ట పట్టణ ఆరోగ్య కేంద్రంలో సోమవారంనాడు వైద్యాధికారి డాక్టర్ అశోక్ బాబు మొదటగా కరోన వ్యాక్సినేషన్ తీసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండో విడత కరోనా వ్యాక్సిన్ లో భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రంలో 49 మంది ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్  వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో తీసుకున్న ఆరోగ్య సిబ్బంది రెండో విడత కూడా కోవిడ్  వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు .మొదటి విడతలో కోవిడ్  వ్యాక్సినేషన్ తీసుకొన్నవారు  రెండో విడత తీసుకున్నట్లయితే వ్యాక్సిన్ పని చేయాదాని వారు తెలిపారు, కోవిడ్  వ్యాక్సినేషన్ పై  అపోహలను ఎవరు నమ్మవద్దని తెలిపారు. జనవరి నెలలో వ్యాక్సిన్ తీసుకున్న వైద్య సిబ్బందికి ఇంతవరకు ఏలాంటి అపాయం జరగలేదన్నారు . ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రామ్మోహన్, స్టాఫ్ నర్స్ రేణుకఆరోగ్య కార్యకర్తలు గాండ్ల మధురిమకె. సౌజన్యఎస్. శారదటి. రజిత భాయిటి రజితఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.