ఈ నెల 13 నుండి కొవిడ్ 19 వ్యాక్సిన్ 2వ విడత

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

- జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్  ఫారుఖీ

నిర్మల్,(ఆరోగ్యజ్యోతి): కొవిడ్ 19   వ్యాక్సినేషన్  జిల్లా  టాస్క్ ఫోర్స్  సమావేశం   జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్  ఫారుఖీ    జిల్లా అధికారులతో    గురువారం  జిల్లా పాలనాధికారి   సమావేశ  మందిరం లో    నిర్వహించారు.   ఈ సందర్భంగా   జిల్లా పాలనాధికారి   మాట్లాడుతూ   ఈ నెల  13  తేదీ  నుండి    కొవిడ్ 19 వ్యాక్సిన్ 2  విడత  ఆరోగ్య  కార్యకర్తలకు   యివ్వడం  జరుగుతుందని  అన్నారు.   టీకా   మొదటి డోస్   తీసుకున్న రొజు  నుండి   28 రోజుల తరవాత  29  రోజు  2వ డోస్  తీసుకోవాలని అన్నారు.   తమ వంతు  భాద్యత గా  అందరు  టీకా  ను  వేసుకోవాలని      టీకా  వేసుకోవడం లో  జిల్లా  వెనుకబడి  ఉందన్నారు.   ఆయా  శాఖల అధికారులు  ముక్యంగా  పోలీస్, డిపీఓ, మున్సిపాలిటీ, రెవెన్యూ    అధికారులు   టెలీ కాన్ఫరెన్స్  నిర్వహించి   వేసుకోని  వారికి  అవగాహన కల్పించి  రేపటి లోగా   ఆయా  శాఖల   సిబ్బంది  వేసుకునే  విధంగా  చర్యలు తీసుకోవాలని   తెలిపారు.   ఫ్రంట్ లైన్  రిజిస్ట్రేషన్  చేసుకున్నవారు  రేపటి లోగా    టీకా  వేసుకోవాలన్నరు.  మొదటి  డోస్  రేపటి లోగా  పూర్తి  అవుతుందని  సిబ్బంది     అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలని  సూచించారు.పోలిస్ శాఖ  70 శాతం  రెవెన్యూ  21 శాతం     మున్సిపల్   19 శాతం  పంచాయితీ   25  శాతం    టీకా లు  వేసుకున్నారని  తెలిపారు.ఈ కార్యక్రమం లో  జిల్లా  అదనపు కలెక్టర్ హేమంత్  బొర్కడె    జిల్లా వైడ్యాధికారి    ధన్రాజ్    asp  రామిరెడ్డి  జిల్లా  అధికారులు తదితరులు పాల్గొన్నారు.