కుష్టును నిర్మూలన అందరి భాద్యత

    కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451
  • డీఎంహెచ్‌వో నరేందర్‌  రాథోడ్‌
  • నేటి నుంచి కుష్టు నివారణ పక్షోత్సవాలు
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):  కుష్టు రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇది అందరి భాద్యతాని ఆదిలాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్  నరేందర్‌ రాథోడ్‌ అన్నారు. శనివారం నాడు  హమాలివాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో కుష్టు నివారణ వారోత్సవాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ నెల 30  మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని కుష్టు నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముందు గాంధిజీ, హెన్సెన్ అనే నావే శాస్త్రవేత్త చిత్ర పటానికి పూలమాలలు వేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్టి వ్యాధి పై ప్రజలు భయపడవలసిన అవసరం లేదని తెలిపినారు.జనవరి30 నుండి  ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్టి వ్యాధి పై పక్షోత్సవాలను నిర్వహిస్తామనితెలిపినారు. కుష్టు వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు వైద్య, ఆరోగ్య శాఖల సిబ్బంది సర్వే నిర్వహిస్తారని వివరించారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 2019-20 సంవత్సరంలో 123 మంది వ్యాధిగ్రస్తులను గుర్తించామని, 2020-21 సంవత్సరంలో 33 మంది గుర్తించి చికిత్స అందించామని వెల్లడించారు.అనంతరం డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన మాట్లాడుతూ శరీరం పై పాలిపోయిన లేదా రాగి రంగు మచ్చలు ,కాళ్ళు , చేతులు తిమిర్లు గా ఉండడం ,ఎంతకీ మానని పుండ్లు ,చర్మము పై ముడతలు లాంటి కాయలు కనిపించడం ,మచ్చలపై నొప్పి తెలియక పోవడం పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ని సంప్రదించాలలని తెలిపినారు. అడిషనల్‌ డీఎంహెచ్‌వో, జిల్లా  లెప్రసీ ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్  శ్రీకాంత్‌ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కుష్టి వ్యాధి గ్రస్తుల కోసం ఒక కాలనీ ఉందని తెలిపారు ఈ కాలనీలో అన్నిరకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని విద్యుత్తు కూడా మరమ్మతులు చేయడం జరిగిందని 13 కుటుంబాలు నిర్వహిస్తున్నారన్నారు ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని కుటుంబాలకు ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు అలాగే 13 కుటుంబాలకు అంత్యోదయ కార్డులు 30 కిలోల బియ్యం ప్రతి నెల చేయడం జరుగుతుందన్నారు. ప్రతి నీకు ఒకసారి వారికి వైద్య పరీక్షలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రిమ్స్ ఆదిలాబాద్ లో ఉన్న టి.హెచ్ .డబ్ల్యూ  వార్డులో  అల్సర్ , రియాక్షన్ వ్యాధి గ్రస్తులకు చికిత్స చేయడం జరుగుతుంది. పాదాలు మొద్దుబారిన వారికి ఎం.సి.ఆర్ . పాదరక్షలు ,అంగవైకల్యం ఉన్నవారికి  కిట్లు  అందించడం జరుగుతుంది. ఈ సమావేశంలో    హమాలివాడ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ నర్మదా , కౌన్సిలర్ సంజేయ్,డీపీఎంవోలు వామన్‌రావు, మధుసూదన్‌రావు,  రమణ, ఆరోగ్యకేంద్రం సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు తదితరులున్నారు.