వైద్యాధికారి నరేశ్‌ భార్యకు గ్రూప్‌ వన్‌ ఉద్యోగం

      కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451


హైదరాబాద్‌(ఆరోగ్యజ్యోతి): కోవిడ్ తో చనిపోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డెప్యూటీ DMHO డాక్టర్ నరేష్ భార్య పావనికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం నాడు  గ్రూప్ వన్ క్యాడర్ ఉద్యోగం GO కాపీని అందించారు. కొవిడ్‌ మహమ్మారికి బలైన సంగతి తెలిసిందే. మణుగూరు క్వారంటైన్‌ ఇంఛార్జిగా విధులు నిర్వహిస్తోన్న సమయంలో నరేశ్‌ కరోనా భారిన పడ్డారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చేరారు. కరోనా పాజిటివ్‌గా వచ్చినా వారం రోజులకే నరేశ్‌ పరిస్థితి తీవ్రంగా మారింది. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. వైద్యుడి కుటుంబాన్ని ఆదుకుంటామని అప్పట్లోనే హామీ ఇచ్చిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హామీ మేరకు డాక్టర్‌ నరేశ్‌ భార్యకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఉద్యోగం కల్పించారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు  ప్రత్యేక చొరవతో ఈ ఉద్యోగం ఇప్పించారని, కష్టపడి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. వైద్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మానవతా కోణంలో ఆలోచించి తనకు గెజిటెడ్ ఉద్యోగం ఇచ్చినందుకు డాక్టర్ నరేష్ భార్య పావని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ధన్యవాదములు తెలిపింది. మంత్రి ని కలిసిన వారిలో పావని తండ్రి సత్యనారాయణ, పిల్లలు సంజని, శరణి తో పాటు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ల సంఘం అధ్యక్షులు డా కత్తి జనార్ధన్, సెక్రెటరీ జెనెరల్ డా పూర్ణ చందర్, వైస్ ప్రెసిడెంట్ డా రాంబాబు, సెక్రేటరీలు డా ప్రవీణ్, డా కిరణ్ తదితరులు ఉన్నారు.