తాంసీ ,(ఆరోగ్యజ్యోతి):
ఆదివారంనాడు తాంసీ మండల కేంద్రంలోని గ్రామ
పంచాయతీ భవనం లో పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని అడిషనల్ డీఎంహెచ్‌వో, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ నివారణ అధికారి,vవైద్య అధికారి డాక్టర్ శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు
వేయించాలని తెలిపారు .మొదటి రోజు పోలియో కేంద్రాల్లో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. రెండవ మూడవ
రోజు ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి
పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు .ఈ కార్యక్రమంలో స్థానిక
సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్,ఉప సర్పంచ్
సంతోష్ రెడ్డి,సుపరవైజార్ సంపత్ కుమారి,ఆరోగ్య కార్యకర్త సుగుణ ఫార్మసిస్ట్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు