పల్స్ పోలియోకు ఏర్పాట్లు పూర్తి

     కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451

జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ నరేందర్

ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ అన్నారు. శనివారం నాడు తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కలు మూడు రోజుల పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 72 వేల 180 మందిని గుర్తించడం జరిగిందన్నారు జిల్లాలో మొత్తం 730 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశామని తెలిపారు . ఒక్కొక్క బూతులో నలుగురు మంది టీమ్ ఉంటుందని మొత్తం జిల్లావ్యాప్తంగా 2920 మంది పని చేశారన్నారు .73 మంది సూపర్వైజర్లు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తారని ఇందులో ట్రైబల్ ఏరియా లో 50 మంది ఏరియాలో 23 మంది పని చేశారన్నారుప్రతీ పోలియో చుక్కల కేంద్రంలో నలుగురు సభ్యులతో కూడిన బృందం ఉంటుంది. పోలియో చుక్కల కేంద్రాన్ని పర్యవేక్షించడానికి రూట్‌ సూపర్‌వైజర్లను ఏర్పాటు చేశామన్నారు.ప్రతీ ప్రాథమిక, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో ఒక మొబైల్‌ బృందాన్ని సిద్ధంగా చేసినామని అయన తెలిపినారు.మొదటి రోజు ఆదివారం 31 జనవరిన ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు చుక్కలు వేసే కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరి 1, 2, తేదీల్లో సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయించుకోని వారిని గుర్తించి పోలియో చుక్కలు వేస్తారు. . ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన ,జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి  డాక్టర్ విజయసారథి , ఎం సి ఎహ్ ప్రోగ్రాం అధికారి   డాక్టర్ నవ్య సుధ తదితరులు పాల్గొన్నారు.