ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): 5సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు
అందించి పోలియో రహిత జిల్లాగా చేయాలనీ స్తానిక
ఎం ఎల్ ఎ జాగు రామన్న, ఆదిలాబాద్
కలెక్టర్ సిక్తా పట్నాయక్,అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టిన పసిబిడ్డ నుండి 5 సంవత్సరాల
లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. నిండు జీవితానికి
రెండు చుక్కలు అందించి పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ
సూచించారు. ప్రభుత్వం బస్ స్టాండ్ లలో, రైల్వే స్టేషన్, ఆరోగ్య
కేంద్రాలలో, పట్టణ ముఖ్య కూడళ్ళలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు
చేసిందని అన్నారు. మూడు రోజుల వరకు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, కొవిడ్ నిబంధనలను
అనుసరించి చిన్నారులకు పోలియో వాక్సిన్ వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్
చైర్మెన్ ప్రేమేందర్, జిల్లా వైద్య
ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాతోడ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో
సాధన ,రిమ్స్
డైరెక్టర్ డాక్టర్ బాలి రాం నాయాక్ డిఐఓ డాక్టర్ విజయసారథి , తదితరులు పాల్గన్నారు.