కే. . నరేష్
కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)
హైదరాబాద్: (ఆరోగ్యజ్యోతి) ఆరోగ్యశ్రీ పథకం విషయంలో
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న
ఆయుష్మాన్ భారత్‌తో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ మేరకు
రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని మోదీ నిర్వహించిన ప్రగతి
సమీక్షలో సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్‌తో
అనుసంధానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు ప్రధానికి సీఎస్ వివరించారు.
వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులు,
ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ తదితర అంశాలపై ప్రధాని సమీక్షించారు. తెలంగాణలో 98.5 శాతం ఇళ్లకు నల్లాల ద్వారా సురక్షిత మంచినీరు అందిస్తున్న తీరును కేంద్ర
ప్రభుత్వం ప్రశంసించిందని సీఎస్ తెలిపారు.