కే. . నరేష్
కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)
ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి) మండల పూజకు వెళ్లే అయ్యప్ప
భక్తులు కార్తీకంలోనూ, మకర
విలక్కుకు వెళ్లే వారు మార్గశిరంలోనూ దీక్షను మొదలుపెడతారు. 41 రోజుల పాటు ఎంతో కఠిన నియమాలతో
దీక్ష చేసిన అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకొంటారని ఆదిలాబాద్
అయ్యప్ప ఆలయ పూజారు , గురు స్వామి దామోదర్ ఆరోగ్యజ్యోతితో తెలిపినారు.యూముడి
గురించి గురు స్వామి దామోదర్ మాటల్లోనే వినడం....
మండల పూజకు
వెళ్లే అయ్యప్ప భక్తులు కార్తీకంలోనూ, మకర
విలక్కుకు వెళ్లే వారు మార్గశిరంలోనూ దీక్షను మొదలుపెడతారు. 41 రోజుల పాటు ఎంతో కఠిన నియమాలతో దీక్ష చేస్తారు. దీక్ష
ప్రారంభించిన రోజు నుంచి స్వామి శరణు వేడుతూ నియమ నిష్ఠలతో పూర్తిచేసి ఇరుముడి
ధరించి శబరిమలై చేరుకుంటారు. కొందరు స్వాములు దీక్ష మొదలుపెట్టిన రోజు నుంచి 41 రోజుల పాటు పాదయాత్ర చేసి స్వామి దర్శనం చేసుకుంటారు. అయ్యప్ప
దీక్ష తీసుకున్న వారికి సంకల్పాలు, కోరికలు
నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. అయితే దీక్ష తీసుకొనే వారం రోజుల ముందు నుంచి మద్య, మాంసాలకు దూరంగా ఉండాలి.దీక్ష తీసుకొనే రోజు ఉదయం
స్నానమాచరించి ఇంట్లో నిత్యపూజ చేసి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలి. చివరిగా
వివాహమైన వారు ధర్మపత్ని అనుమతితో దీక్ష తీసుకోవాలి. స్వామి దీక్షను ఏదైనా ఆలయంలో
తీసుకోవచ్చు. చందనం లేదా తులసిమాలకు పూజచేసి మూలమంత్రాన్ని గురుస్వాముల ద్వారా
గ్రహించాలి. దీక్ష పూర్తయినంత వరకూ మెడలో మాలను తీయరాదు. దీక్షలో ఉన్నప్పుడు తమకు
తోచిన విధంగా కనీసం ఐదుగురు స్వాములకైనా భిక్ష ఏర్పాటు చేయాలి.41 రోజుల దీక్ష పూర్తయిన తర్వాత ఇరుముడి ధరించి శబరిమలకి
బయలుదేరుతారు. స్వామికి సమర్పించడానికి భక్తులు తీసుకెళ్లేదే ఇరుముడి. ఇరుముడి
అంటే రెండు ముళ్లు కలదని అర్థం. ఇందులో భక్తి, శ్రద్ధ అనే
రెండు భాగాలు ఉంటాయి. కొత్త వస్త్రాన్ని రెండు భాగాలుగా కుట్టించి ముందు ముడిలో
దేవుడికి సంబంధించి సామాగ్రి, వెనుక
ముడిలో మార్గ మధ్యలో అవసరమైన సామాగ్రి, మాలికాపురత్తమ్మకు
జాకెట్టు, పసుపు, కుంకుమ
ఉంచుతారు. ఓ కొబ్బరి కాయలో నీటిని తొలగించి, దాన్ని అవు
నెయ్యితో నింపుతారు. దీని అర్థం జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడం. భక్తి అనే
ముందు ముడిలో ఈ కొబ్బరి కాయను పెడతారు. వెనుక భాగంలో ఇతర పూజా సామాగ్రి ఉంచి
ఓంకారమనే తాడుతో ముడివేస్తారు. భక్తి, శ్రద్ధ
ఎక్కడ ఉంటాయో అక్కడే ఓంకారం ఉంటుందనడానికి ఇదే నిదర్శనం. కొబ్బరి కాయలో ఉంచిన
నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇరుముడితో పద్దునెట్టాంబడి ఎక్కి
అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు.