ఉపేందర్ కు కరోనా వారియార్ సేవా సామ్రాట్ అవార్డు

  కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 70132601769848025451)

 హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి):  హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ప్రపంచ వికలాంగుల దినోత్సవం  వేడుకలు జరిగినవి.ముఖ్య అతిధి డా.వాసుదేవ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్,ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు, NPRD India వ్యవస్థాపకులు రాజేందర్,జాతీయ అధ్యక్షుడు మున్నా ,చేతుల మీదగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా NPRD India అధ్యక్షులు,ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్థిక శాఖ దివ్యాంగ పరిశోధక విద్యార్థి కి కరోనా సమయంలో  వికలాంగులకు,పేద ప్రజలకునిత్యావసరాల పంపిణి చేయించి పలు సేవాకార్యక్రమాలు చేసింది గుర్తించి,కరోనా వైరస్ పై పద్య కవితలతో ప్రజలను చైతన్య పరిచి సమాజానికి సేవలు చేసి ఆదుకున్నందున, మొక్క ఉపేందర్ కు కరోనా వారియార్ సేవా సామ్రాట్ అవార్డు ఇవ్వడం జరిగింది. సందర్భంగా ఉపేందర్ వికలాంగులకు ఉద్యోగాల ప్రకటన చేయాలని కోరామని, రెండు పడక గదుల ఇండ్లు,మోటార్ వాహనాలు,కృత్రిమ పరికరాల ఇస్తా మన్నారన్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వాసులు,అధ్యక్షులు మొక్క ఉపేందర్,ఉపాధ్యక్షులు ఆకుల లింగమల్లు, బాలరాజు,రాజాగౌడ్, అండాలు, నిర్మల,లలిత, బాలమణి, భాస్కర్, తదితర దివ్యాంగులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.