అయ్యప్ప ఆలయానికి వాటర్ డిస్పెన్సరీ

 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయానికి ఆలయ కమిటీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గురు స్వామి బుధవారం నాడు స్వాములకు మంచి శుద్ధమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో వేడి చల్లటి  తాగునీటి కోసం వాటర్ డిస్పెన్సరీ డొనేట్ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కరోనా ను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క స్వామి వారు వేడి నీళ్లు తాగాలి అనే ఉద్దేశంతో  ఈ వాటర్ డిస్పెన్సరీ అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు వేడి నీళ్లు తాగడం వల్ల కరోన  దరిచేరకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి దామోదర్ ప్రధాన కార్యదర్శి  చంద గణేష్, కోశాదికారి చిండం దేవిదాస్, బారే నగేష్  త దితరులు పాల్గొన్నారు.