ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి): కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హెచ్ఐవి ఎయిడ్స్ కు సంబంధించిన గోడ ప్రతులను జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ సోమవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూఅర్హులైన వారందరికీ ఆసరా పింఛన్ అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్అన్నారు.హెచ్ఐవి వ్యాధి గ్రస్తులకు మందుల కంటే తోటి వారి ఆదరణ ఆప్యాయతలు ప్రేమ చాలా అవసరమన్నారు. హెచ్ఐవి రహీత ఆదిలాబాద్ స్థాపనకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా హెచ్ఐవి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు జిల్లా అధికారి డాక్టర్ శ్రీకాంత్, జిల్లా ఎయిడ్స్ కార్యనిర్వహణ అధికారి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.