కరోన దృష్ట్యా నిబంధనలకు లోబడే ఆయప్ప స్వామి పూజలు

 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):  ప్రభుత్వ ఆదేశానుసారం నిబంధనలకు లోబడే బెల్లూరి అయ్యప్ప స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్షి చంద గణేశ్, కోశాధికారు చిందం దేవిదాస్, ఉపాధ్యక్షులు బుషెట్టి మహేంధర్ ,సహాయ కార్యదర్షులు దాముక రవిందర్, చందు, నాగేష్ ,క్రాంతి కుమార్, ఆస్తాన గాయకులు  దిలీప్ గురుస్వామి తెలిపారు. కరోనాను  దృష్టిలో ఉంచుకొని ఆలయం దీక్షా కాలంలో జరిగే బిక్ష,పడి పూజ కార్యక్రమాలు గురించి ఆలయ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ప్రతి ఏటా నిర్వహించే  ఆరాట్టు కార్యక్రమం ఈసారి  ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిరాడంబరముగ కొనసాగుతుందని వారు తెలిపినారు. ప్రతి ఏట నిర్వహిస్తున్న ఆరట్టు, మండలపూజ, మకరవిల్లకు, సుభ్రమన్య షష్టి రోజు తప్ప మిగత రోజులల్గో భీక్షలు  ఆలయంలో ఉండవు వారు తెలిపారు. గతంలో అయ్యప్ప ఆలయంలో ప్రతి రోజు బిక్ష కార్యకమం ఉండేదని ఈ ఏడాది కరోన కారణంగా బిక్ష రద్దు చేస్తున్నట్లు వారు తెలిపినారు.అలాగే పడిపూజ కార్యక్రమం కూడా రాత్రి వేళలో కాకుండా ఉదయం ఆలయంలో మాత్రమే నిర్వహించడం జరుగుతుందని పడిపూజలు పూజ చేసుకునే అయ్యప్ప స్వాములు దీనికి గాను 1,116 రూపాయలు ఆలయంలో  చెల్లించి రశీదు తీసుకోవాలని తెలిపారు .అయ్యప్ప స్వామి వారి మాలాధారణ వేసుకున్న స్వాములు అందరూ నియమ నిబంధనలు సూచనలు తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు