ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి);
ప్రభుత్వ ఆదేశాలమేరకు వైద్య ఆరోగ్య శాఖ అద్వర్యంలో ప్రతీ గ్రామం లో కరోనా
టెస్టింగ్ శిభిరాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఇన్చార్జ్ అడిషనల్ డి ఎం అండ్ హెచ్
వో జిల్లా లెప్రసీ మరియు ఎయిడ్స్ నివారణ అధికారి, ద్యులు డాక్టర్ శ్రీకాంత్ తెలిపినారు. గతం లో కూడా ప్రతీ
గ్రామం లో కోవిడ్ టెస్టింగ్ క్యాంపులు
పెట్టడం జరిగినదని ఈసందర్భంగా అయన తెలిపినారు. ప్రతిరోజూ ప్రతి ప్రాతమిక ఆరోగ్యకేంద్రంలో లో 9 నుండి 4 గంటల వరకు కోవిడ్ టెస్ట్
లు చేయటం జరుగుతుందని తెలిపినారు. ఈ కోవిడ్ మహమ్మారిని
ఎదుర్కొనడానికి అందరి సహకారాలు తప్పనిసరి అవసరమని ఈ సందర్భంగా అయన కోరినారు. అందరు
మాస్క్ తప్పనిసరిగా ధరించి, భౌతిక దూరం పాటించలని తెలిపినారు. జ్వరం, దగ్గు ,జలుబు, దమ్ము, లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని PHC కి వచ్చి కోవిడ్ టెస్ట్ లు
తప్పనిసరిగా చేసుకోవాలని అయన సూచించారు. ఇందుకుగాను గ్రామా సర్పంచ్ లు ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు , మహిల సంఘాలు తూపాటు
ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరు
సహకరించాలని అయన కోరినారు.