- వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగ
సంఘo అధ్యక్షులు భరత్ సత్యనారాయణ
సంగారెడ్డి (ఆరోగ్యజ్యోతి): దేశవ్యాప్త సమ్మె సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యల పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో తమ డిమాండ్ల కొరకు నిరసన కార్యక్రమం చేసినారు ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగ సంఘo అధ్యక్షులు భరత్ సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగులకు PRC నీ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసినారు.వైద్య ఆరోగ్య శాఖ లోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేసినారు .ఈ కార్యక్రమంలో నాయకులు గుండయ్య గారు సూపరిండెంట్ శ్రీ వాణి, చందర్ నాయక్, ఉమాకాంత్, ముంతాజ్ అలి,ఉషారాణి,శివరాజ్ ,సాయి ప్రసాద్ ,ANM లు ,ఉద్యోగులు పాల్గొన్నారు.