ఘనంగా అయ్యప్ప మాల ధారణ కార్యక్రమం

 

ఆదిలాబాద్ ,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ పట్టణంలోని బెల్లూరి  అయ్యప్ప స్వామి ఆలయంలో గురు వారం రోజు అత్యంత భక్తి శ్రేద్దలమద్య 61  మంది స్వాములు  అయ్యప్ప మాల ధారణ కార్యక్రమాన్ని చేశారు. గురుస్వామి దామోదర్ ఆధ్వర్యంలో మాలధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాలాధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంతో పాటు చుట్టుపక్కల వివిధ గ్రామాలనుండి అయ్యప్ప స్వాములు కార్యక్రమం చేశారు. దీక్ష కార్యక్రమంలో గురుసాములు అద్యక్షులు  వేణు గోపాల్ , ప్రధాన కార్యదర్శి  చంద గణేష్,  తదితరులు పాల్గొన్నారు