బెల్లూరి ఆలయంలో ఘనంగా అయ్యప్ప మాలాధారణ కార్యక్రమం

 211 స్వాముల మాలాధారణ

ఆదిలాబాద్ ,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ పట్టణంలోని బెల్లూరి  అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం నాడు 211 మంది అయ్యప్ప మాల ధారణ కార్యక్రమాన్ని చేశారు. గురుస్వామి దామోదర్ ఆధ్వర్యంలో మాలధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాలాధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంతో పాటు చుట్టుపక్కల వివిధ గ్రామాలనుండి అయ్యప్ప స్వాములు కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి దామోధర్ మాట్లాడుతూ మాల ధరించిన స్వాములంతా నిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానమాచరించి సూర్యోదయం కాకముందే పూజనుముగించాలని అన్నారు.. తిరిగి సాయంత్రం చన్నీటి స్నానం చేసి సంధ్యాపూజ చేయాలని గురుస్వామి తెలిపినారు. దీక్షా సమయంలో హోదా, వయస్సు, పేద, ధనిక తేడా లేకుండా అయ్యప్పలందరికీ పాదాభివందనం చేయాలని తెలిపినారు.శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకొని సన్మార్గంలో పయనింపజేసేదే అయ్యప్ప మండల దీక్ష. 41 రోజుల పాటు అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటూ నిత్యశరణు ఘోషతో పూజిస్తారు. మనసారా అయ్యప్పస్వామిని కొలవడమే ఈ దీక్ష పరమార్థంమని  రోజులో ఒకసారి భిక్ష.. మరోసారి అల్పాహారం.. రెండుసార్లు చన్నీటి సాన్నం.. నేలపై నిద్రించాలనే కఠిన నియమాలతోరణమే ఈ దీక్ష. ప్రాధాన్యత అన్నారు. దీక్ష కార్యక్రమంలో గురుసాములు అద్యక్షులు  వేణు గోపాల్ , ప్రధాన కార్యదర్శి  చంద గణేష్, కోశాదికారి చిండం దేవిదాస్, బారే నగేష్  త దితరులు పాల్గొన్నారు.