- జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.
నిర్మల్(ఆరోగ్యజ్యోతి):
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు
పెరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ వైద్యశాఖ
అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం
కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల పై సంబంధిత అధికారులతో
నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ
సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ప్రాంతీయ
ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులలో 25శాతం సాధారణ ప్రసవాలు కచ్చితంగా జరగాలన్నారు. గర్భిణీలకు, కుటుంబ సభ్యులకు ఆపరేషన్ల వలన కలిగే
అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రోజు ప్రసవాల వివరాలను ఆన్ లైన్ లో నమోదు
చేయాలన్నారు. ఈ సమావేశంలో డాక్టర్లు
రజిని, సుభాష్, సరోజ, స్వర్ణ రెడ్డి,లక్ష్మి చైతన్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.