క్షయని గుర్తిస్తే చికిత్స సులభం

 

ఆశాలు క్షయ కేసులు గుర్తించాలి

పలు ఆరోగ్య పథకాలపై అవగాహన

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్

 ఆదిలాబాద్,తాంసీ(ఆరోగ్యజ్యోతి): క్షయ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే చికిత్స సులభంగా అవుతుంద అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ అన్నారు. తాంసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆశా కార్యకర్తలకు వైద్య ఆరోగ్య సిబ్బంది కి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ క్షయ నివారణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే రోగి యొక్క తెమడను తీసుకువచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించాలని తెలిపారు వ్యాధి ప్రారంభ దశలో గుర్తించినట్లయితే  చికిత్ససులభంగా నయం  అవుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025 సంవత్సరం లోగా క్షయ భారతదేశంలో అంతం కావాలని సూచించారని తెలిపారు, అదేవిధంగా ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ 2030 వరకు క్షయ ప్రపంచవ్యాప్తంగా అంతం  కావాలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు .అయితే భారతదేశంలో మాత్రం ఐదు సంవత్సరాల ముందు గానీ వ్యాధి పూర్తిగా న్యాయం చేయాలని తెలిపారు. ఆశా కార్యకర్తలు క్షయ కేసులను తీసుకో వచ్చినట్లయితే ప్రతి నెలా వచ్చే అలవెన్సులు తోపాటు అదనంగా 500 రూపాయలు ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరుగుతుందన్నారు. క్షయలక్షణాలు  కి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించాలన్నారు.అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య పథకాలను అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఇమ్యునైజేషన్ తోపాటు మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపినారు. క్రమం తప్పకుండా గర్భవతులు యొక్క పేర్లను నమోదు చేయాలని దీనివల్ల కేసీఆర్ తో పాటు ప్రభుత్వం ఇచ్చే పారితోషికం అందుతుందన్నారు. ఆస్పత్రిలో ప్రసూతి ఐఎవిడగా  చూడాల్సిన బాధ్యత ఆశ కార్యకర్తలతో పాటు ఆరోగ్య సిబ్బంది పై కూడా ఉందన్నారు. ఆస్పత్రిలో ప్రస్తుత అయినట్లయితే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు .ఎప్పటికప్పుడు సిబ్బంది గ్రామాల్లో పర్యటించి వ్యాధుల పై అవగాహన కల్పించాలన్నారు. టిబి, లెప్రసీ, మలేరియా వ్యాధులపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపినారు. మలేరియా వ్యాధి నివారణ కోసం గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కుటుంబ నియంత్రణ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు . జాతీయ కార్యక్రమాలపై కూడా గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ సూచించారు. అనంతరం జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ వై సి శ్రీనివాస్. ఇన్చార్జ్ అడిషనల్ డి ఎం అండ్ హెచ్ వో జిల్లా లెప్రసీ మరియు ఎయిడ్స్ నివారణ అధికారిప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ శ్రీకాంత్,  జిల్లా క్షయ నివారణ అధికారి   డాక్టర్ ఈశ్వర్ రాజ్ , జిల్లా మలేరియ నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్. జిల్లా NCD అధికారి    డాక్టర్ క్రాంతి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు చెట్టుకు వేర్లు ఎలా ఉపయోగపడతాయో ఆ విధంగా వైద్య ఆరోగ్య శాఖకు కీలకపాత్ర పోషిస్తారు ప్రతి విషయం ఆశ కార్యకర్తలకు తెలిసి ఉండాలని ఈ సందర్భంగా వారు సూచించారు ,వివిధ రకాల వ్యాధులు ఆశా కార్యకర్తలు దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత ఆరోగ్య కార్యకర్త కు గాను, సూపర్వైజర్కి కిగాను,  వైద్య అధికారికి గాను సమాచారం ఇవ్వాలన్నారు. అన్ని రకాల సమాచారం ఆశా కార్యకర్తలు వద్ద ఉండాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. వైద్య ఆరోగ్య శాఖలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో చర్చించారు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల గురించి కూడా సిబ్బందికి వివరించారు విధులు సక్రమంగా నిర్వహించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని అధికారులు సూచించారు, ముందుగా ల్యాబ్ ని పరిసిలించారు. అన్నిరకాల పరిక్షలు చేయాలనీ సుచిచారు. ఈ సందర్భంగా 40  మందికి క్షయ పరీక్షలు నిర్వహించడంతో పాటు, కరోన  టెస్ట్ లు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు. సంపత్ కుమారి, తులసి రామ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












x