ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి): ప్రతి యేటా నిర్వహించే
జాతీయ ఇమ్యూనైజేషన్ (పల్స్ పోలియో)కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని వచ్చే ఏడాది
జనవరి 17న నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ౦ నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే
పోలియో చుక్కలను
అందించాలని ఈ
మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ఆరోగ్య ముఖ్య కార్యదర్శులను
ఆదేశించింది. ఇందులో భాగంగా అవసరమైన వైద్య సిబ్బంది నియామకం, ప్రచార కార్యక్రమం వంటి
అంశాలపై వెంటనే ప్రణాళిక రచించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఏటా నిర్వహిస్తూ
వస్తున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం 2021 లోనూ నిర్వహించాలని ప్రభుత్వం
నిర్ణయం తీసుకున్నది. పోలియో మహమ్మారి పూర్తిగా తగ్గిపోయినట్లు కేంద్రం ఒక అంచనాకు
వచ్చినప్పటికీ… ఆయా రాష్ట్రాల్లో పోలియో లక్షణాలతో బాధ పడుతున్న
చిన్నారుల వ్యవహారం వెలుగు చూస్తున్న నేపథ్యంలో 2021లోనూ ఈ పల్స్ పోలియో చుక్కల
పంపిణీ కార్యక్రమం కొనసాగించాలని కేంద్ర నిర్ణయించింది. ఇండియన్ ఎక్స్పర్ట్
అడ్వైజరీ గ్రూప్ సూచనల మేరకు వచ్చే ఏడాది జనవరి 17న దేశవ్యాప్తంగా పల్స్ పోలియో
కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.