సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్
షాబాద్(ఆరోగ్యజ్యోతి) : ఆరోగ్యంగా ఉన్న ప్రతి యువకుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని షాబాద్ మండల కేంద్రంలోని స్టార్ గార్డెన్‌లో శుక్రవారం స్థానిక జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ మాణిక్‌రావు, చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి, మండల వైస్ ఎంపీపీ జడల లక్ష్మి, సీఐ ఆశోక్‌కుమార్,సర్పంచ్ సుబ్రహ్మణ్యేశ్వరిలతో కలిసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ...ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తదానం చేయాలని సూచించారు. రక్తదానం చేస్తే ఏమి అవుతుందోననే అపోహలు పెట్టుకోకుండా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ కారణంగా ఆస్పత్రుల్లో రక్తం దొరకక చాలా మంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తలసేమియా వంటి వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అలాంటి పరిస్థితులను చూసిన తర్వాత పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరిస్తున్నట్లు చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 7వేల బ్లడ్ యూనిట్స్ సేకరించడం జరిగిందన్నారు. సేకరిం చిన రక్తాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 బ్లడ్ బ్యాంకులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా 24గంటల పాటు ప్రజలకోసం అందుబాటులో ఉంటున్నట్టు తెలిపారు. అనంతరం పలుమార్లు రక్తదానం చేసిన వారిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారికి అండగా నిలువాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మహేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ కోట్ల మహేందర్‌రెడ్డి, నాయకులు ఎంఏ మతిన్, పొన్న నర్సింహరెడ్డి, జడల రాజేందర్‌గౌడ్, నర్సింగ్‌రావు, వెంకట్‌యాదవ్, పీసరి సతీశ్‌రెడ్డి, రమేశ్‌యాదవ్, సూద యాదయ్య, బర్క కృష్ణాయాదవ్, యాదిరెడ్డి, వెంకటయ్య, రవీందర్, కిరణ్, రాము, మధుకర్‌రెడ్డి, సంజీవ, శేఖర్, చెన్నయ్య, దర్శన్, ఇమ్రాన్, రాజేందర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ముక్రం, అవిలాశ్‌గౌడ్, ఇనాయత్, గణేశ్‌గౌడ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.