హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): ఉస్మానియా మెడికల్ కాలేజీ, జనరల్ ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతిగా డాక్టర్ పి. లక్ష్మిని నియమించారు. ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో పనిచేస్తున్న ఆమెకు పదోన్నతి లభించింది. 2002 నుంచి 2005 వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసిన ఆమె 2005లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి వైద్య సేవలు అందిస్తున్నారు. ఓ మహిళ డాక్టర్ ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి అధిపతి కావడం ఇదే మొదటిసారి.