ఓయూ పరీక్షలు

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన పీజీ ఫైనలియర్​ సెమిస్టర్​ పరీక్షలను రేపటి నుంచి నిర్వహించనున్నట్టు ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్​ శ్రీరాం వెంకటేష్​ తెలిపారు. ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం సహా ఇతర పీజీ పరీక్షల నాలుగో సెమిస్టర్​ పరీక్షలను షెడ్యూల్​ ప్రకారం నిర్వహించనున్నట్టు వివరించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక పరీక్షను ఆదివారం కూడా నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలను ఓయూ అధికారిక వెబ్​సైట్​లో పొందవచ్చని ఆయన సూచించారు.


సెమిస్టర్​ –4 షెడ్యూల్​



































తేదీవారంపేపర్​
27‌‌–10–2020మంగళవారంపేపర్​ –1
28–10–2020బుధవారంపేపర్​ –2
29–10–2020గురువారంపేపర్​ –3
31–10–2020శనివారంపేపర్​ –4
01‌‌–11–2020ఆదివారంపేపర్​ –5