హైదరాబాద్ : నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు హోప్‌ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. అనంతరం నిర్వహకులు మాట్లాడుతూ.. ఆసక్తి గల నిరుద్యోగులు www.hyseplacments.com వెబ్‌సైట్‌లో రిజిస్టేషన్ చేసుకోవాలని తెలిపారు. ఈ జాబ్‌మేళాలో 100కుపైగా కంపెనీలు 1000కి పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంబీఏ, బీ-ఫార్మసీ, డీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ అర్హత కలవారు వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. జాబ్‌మేళాలో సెలక్ట్ అయిన వారికి నవంబర్ 11న జాబ్ ఆఫర్ లేటర్ ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని హోప్‌ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్‌కుమార్ సూచించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ప్రవీణ్‌రెడ్డి, సంతోష్ కుమార్, అజయ్, విజయ్, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీను, విద్యాసాగర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.