- పెద్ద తలతో జన్మించిన శిశువుకు మెరుగైన వైద్యం
- చికిత్స అందించిన ఉస్మానియా, నిలోఫర్ వైద్యులు
ఆదిలాబాద్, భీంపూర్: పెద్ద తలతో జన్మించి బతుకడమే కష్టమైన ఓ శిశువుకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు నిలిపారు ఉస్మానియా, నిలోఫర్ వైద్యులు. ఆదిలాబాద్ జిల్లా భీం పూర్ మండలం కరంజి(టి) గ్రామ పంచాయతీ పరిధిలో గల రాజులవాడి గ్రామానికి చెందిన కుడిమెత సువర్ణ అనే మహిళా ఈ నెల 26న ఆదిలాబాద్ రిమ్స్‌లో అమ్మాయికి జన్మనిచ్చింది. పుట్టిన శిశువు తల పెద్దగా ఉంది పుట్టడంతో వెంటనే రిమ్స్ వైద్యులు శుసువుని అన్నిరకాలుగా పరీక్షించి వైద్యులు ఆ శిశువుకి హైడ్రోసెఫాలన్ వ్యాధితో పుట్టిన దాని వైద్యులు గుర్తించారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. వైద్యులు పాప తలలోంచి నీరు తొలిగించగా.. ప్రస్తుతం నిలోఫర్‌లో చికిత్స అందిస్తున్నారు. బతకడమే కష్టమనుకున్న తరుణంలో ఉస్మానియా, నిలోఫర్ వైద్యులు మెరుగైన వైద్యం అందించారన్నారు.