వైద్య సిబ్బందినీ ప్రభుత్వం ఆదుకోవాలి

NHM  నేషనల్  హెల్త్  మిషన్  కో - చైర్మన్ రామ రాజేష్ ఖన్నా


వరంగల్ (ఆరోగ్యజ్యోతి): కరోన  వైరస్ నియంత్రణకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రిజైన్ నెంబర్ ఈ- 1926/98 కాంట్రాక్టు అండ్ అవుట్ సౌర్చింగ్ రాష్ట్ర నేషనల్ హెల్త్ మిషన్ కో -చైర్మన్ రామ రాజేష్ ఖన్నా అన్నారు. కరుణ వైరస్ నియంత్రణ కొరకు వైద్య ఆరోగ్య శాఖలో నిధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉండాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి బుధవరము రోజున పత్రం లేఖ రాయడం జరిగింది. ఈ సందర్భంగా రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ కొవిడ్ -19 నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 65 శాతం పేమెంట్ తో పిఆర్సి ప్రకటించాలని పెండింగ్లో ఉన్న డి .ఏ .లు వెంటనే ఇవ్వాలని అలాగే ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరడం జరుగుతుందన్నారు.వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న డాక్టర్ పారా మెడికల్ సిబ్బందికి కంటోన్మెంట్ జోన్లలో రెడ్లలో అనునిత్యం వైద్య సేవలందిస్తూ కరుణ వైరస్ పాజిటివ్ వచ్చి మరణించడం జరుగుతుంది.వైద్య ఉద్యోగులందరికీ 50 లక్షలు ఇన్సూరెన్స్ చేయించాలని ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇళ్ల స్థలాలు 30 లక్షల రూపాయల నగదు అందించాలని అన్నారు . ప్రభుత్వ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్స్ , ఆశా వర్కర్ల ఏ.ఎన్.ఎమ్ , మెడికల్ అసిస్టెంట్ , ఫార్మసిస్ట్ , ల్యాబ్ టెక్నీషియన్ అకౌంటెంట్ అండ్ క్లర్క్ , వాచ్ మెన్ , స్వీపర్ తదితర సిబ్బందిని రెగ్యులర్ చేయాలని అని కోరడం జరుగుతుందన్నారు. వైద్య శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలవాలని అన్నారు .