వరంగల్ (ఆరోగ్యజ్యోతి) : ఆడ శిశువు పుట్టి సుమారు వారం రోజులైనా కాలేదు.. తల్లి నుంచి వేరు చేసి రోడ్డుపై వదిలి వెళ్లిన హృదయ విదార క ఘటన వరంగల్ ఎంజీఎం దవాఖాన వద్ద శుక్రవారం తెల్లవారుజా మున చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు హాస్పిటల్ ప్రధాన గేటు ఎదుట పాపను వదిలివెళ్లారు. రోడ్డు పక్కన పాప ఏడుపు గమ నించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచా రం అందించారు. దీంతో మట్టెవాడ ఎస్సై శ్రీనివాసరెడ్డి, హెడ్ కానిస్టే బుల్ రవిశంకర్, కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, సోమయ్య అక్కడికి చేరు కుని ఎంజీఎం పిల్లల వార్డులో చేర్చారు. 2.4 కిలోల బరువుతో పాప ఆరోగ్యంగానే ఉందని, వైద్య సిబ్బంది శిశువు బాగోగులు చూసుకుం టున్నారని పిల్లల విభాగం అధిపతి డాక్టర్ ప్రతాప్ తెలిపారు. శిశు గృహ అధికారులకు సమాచారం ఇచ్చామని, వైద్య పరీక్షలు పూర్తయి న తర్వాత అప్పగిస్తామని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ నాగా ర్జున్‌రెడ్డి తెలిపారు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా పాపను వదిలి వెళ్లిన వారిని గుర్తించేందుకు విచారణ చేపట్టారు.