హైదరాబాద్: తెలంగాణలో కరోన కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 21,099 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 837 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,32,6711కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 1,315కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,554 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 2,13,466కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,890 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 14,851 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 41,15,516కి చేరింది.