వైద్య అధికారి,సూపర్వైజర్ లపై చర్యలు తీసుకోండి


ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి); ఇటీవల గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సూపర్వైజర్ల పై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తి చేయాలని తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండారి కృష్ణ,వామన్  రావు లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో విచారణ కమిటీ గత నెల 23న నియమించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ కమిటీ విచారణ చేపట్టక పోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ ఘటనపై వారం రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొందని  కాలయాపన చేయడం సరికాదన్నారు. జిల్లావ్యాప్తంగా పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జాతీయ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడానికి వైద్య అధికారులతో పాటు పారా మెడికల్ సిబ్బంది అహర్నిశలు పని చేశారన్నారు. విధులను సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ వైద్య సిబ్బందిని కొంతమంది వైద్యాధికారులు పీహెచ్సీలకు సబ్ సెంటర్ లో విడుదలయ్యే నిధుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఉద్యోగులకు ఉండాల్సిన పారితోషకాన్ని సైతం ఇవ్వకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నారని వారు  ఆరోపించారు. వైద్య అధికారుల పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అనడం  సబబు కాదని విచారణ పూర్తయితే నిజాలు ఏమిటో వెలుగులోకి వస్తాయి అన్నారు. మహిళా సిబ్బంది వేధింపులకు గురి అవుతున్నారని బహిరంగంగా వారు పేర్కొన్నాప్పటికి వారిపై చర్య ఎందుకు తీసుకోవడం లేదని వారు అన్నారు.