హైదరాబాద్ : డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘దోస్త్’ గడువును పొడిగించారు. మూడోవిడతలో సీటు పొందినవారికి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు ఇప్పటికే పూర్తయింది. దీనిని ఈనెల 28 వరకు పొడిగించినట్లు దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు. భారీ వర్షాలు, వరుస సెలవుల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక విడత రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక గడువును కూడా ఈనెల 28 వరకు పొడిగించామన్నారు. ప్రత్యేక విడత జాబితాను ఈనెల 31న విడుదల చేస్తామన్నారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 31 నుంచి నవంబరు-5లోపు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నారు.