ప్రధాని మోడీ మంగళవారం మూడు లక్షల మంది వీధి వ్యాపారులకు పీఎం స్వానిధి (ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి యోజనా) పథకం కింద రుణాలను పంపిణీ చేయనున్నారు. అంతేకాదు, లబ్దిదారులతో ఆయన ఆన్‌లైన్ లోనే ముచ్చటించనున్నట్టు యూపీ సమాచార శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి నవనీత్ సెహెగల్ వెల్లడించారు.స్వానిధి పథకం కింద వీధి వ్యాపారులకు సుమారు రూ. 10వేల వర్కింగ్ క్యాపిటల్‌ను కేంద్రం అందించనుంది. ఈ పథకానికి అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి దరఖాస్తులు వచ్చాయి. 5.57 లక్షల వ్యాపారులు యూపీ నుంచి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. లాక్‌డౌన్‌తో నష్టపోయిన వీధి వ్యాపారులకు చేయూతనివ్వడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.