హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి) : ఉద్యోగ విరమణ పొందిన ప్పటికీ తెలంగాణ వైద్య ఉద్యోగుల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తూ అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేసిన తెలంగాణ వైద్య, ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కర్నాటి సాయి రెడ్డి జన్మదిన వేడుకలను సందర్భంగా H1 యూనియన్ ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ లోని మినీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగినది. తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్H1 యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కర్ణాటి సాయి రెడ్డి 60వ జన్మదిన వేడుకల.TMPHEU-H1 ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా పురుషోత్తం రెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షులు కరణం సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రేణు కుమార్ , 104 యూనియన్ తరపున కిషోర్ కుమార్ , బుజ్జి కృష్ణమోహన్ గ్రేటర్ హైదరాబాద్ యూనియన్ గౌరవ సలహాదారులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య ఉద్యోగుల సంక్షేమ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ పదవి విరమణ పొందిన ప్పటికీ ఇంకా నిరంతర సేవలను ఉద్యోగుల సంక్షేమం కోసం కేటాయిస్తూ కృషి చేస్తున్న సాయి రెడ్డికి ఆయురారోగ్యాలతో పాటు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ నట్లు తెలిపారు.