డిఎంఎహ్ఓ కార్యాలయ గణాంక అధికారి గా బ్రహ్మానందం రెడ్డి

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి) : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయ గణాంక అధికారి గా బ్రహ్మానందరెడ్డిని నియమితులయ్యారు ఈయన తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో హెచ్ఇ వో గా విధులు నిర్వహిస్తున్నారు. తనపై నమ్మకంతో ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి శాఖ పరంగా అన్ని కార్యక్రమాలు చేపడతాం అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన బ్రహ్మానంద రెడ్డికి తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు బండారి కృష్ణ,సిడం వామన్ రావ్   ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో డి పి ఓ మధుసూదన రావ్  మాస్ మీడియా అధికారి వెంకట్ రెడ్డి  యూనియన్ నేతలు శ్రీకాంత్,రమణాచా,రి సంతోష్, రఘురాం తదితరులు పాల్గొన్నారు.


1989 లో హెల్త్ అసిస్టెంట్ గా విడుల్లో చేరినారు. 6 సం  తలమద్రిలో, పని చేసినారు.అలాగే కుంతలా, నేరదిగొండలో సుపర్వైజర్ గా విదులు నిరహించారు.6 సం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయ ఎహ్ఇఓ గా పని చేసినారు. జిల్లా విభజన సమయంలో ఆసిఫాబాద్ వెళ్ళినారు అనంతరం నర్సాపూర్ బదిలీ అయినారు. తిరిగి కోవిడ్-19లో డిఎంఎహ్ఓ కార్యాలయ వచ్చారు. ఇటివల డిఎంఎహ్ఓ కార్యాలయ గణాంక అధికారి గా నియమితులైనారు.