- పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీదేవి
వరంగల్(ఆరోగ్యజ్యోతి): ఆయా కాలనీల్లో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీదేవి అన్నారు. శుక్రవారం నాడు చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు .పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నట్లయితే వ్యాధులు దరిచేరవని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.కరోన రాకుండా ఉండేందుకు సామాజిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని, ప్రతి అరగంటకు ఒకసారి సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. అవసరం ఉన్నట్లయితే బయటకు వెళ్లాలని లేనిపక్షంలో బయటకు వెళ్ళవద్దని సూచించారు రు. మలేరియా రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఇంటి చుట్టుపక్కల నీళ్లు నిలువకుండా జాగ్రత్తపడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మలేరియా సూపర్వైజర్ తేజావత్ రవీందర్ మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా ,ఆరోగ్య కార్యకర్తలు శ్రీలత ఆశా కార్యకర్తలు అనూష తదితరులు పాల్గొన్నారు.