- జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఎం శ్రీధర్
ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి): సీజనల్ వ్యాధులు రాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఎం శ్రీధర్ అన్నారు. పట్టణ ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఖుషినగర్ లో సీజనల్ వ్యాధులు, కరోన పై మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల వ్యాధులు దరిచేరవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు .కరోనా నివారణకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని తెలిపా.రు సామాజిక దూరం మాస్కులు ధరించడం వల్ల వ్యాధి దరిచేరదని తెలిపారు. అత్యవసర పరిస్థితులు మాత్రం బయటకు వెళ్లాలని లేనిపక్షంలో ప్రజలు బయటకు వెళ్ల వద్దని ఆయన తెలిపినారు.. కరోన వచ్చిన వ్యక్తి 14 నుంచి 17 రోజులపాటు హోమ్ సొల్యూషన్ లో ఉండాలని డాక్టర్లు సూచించిన మేరకు సూచనలు క్రమం తప్పకుండా పాటించాలన్నారు. అనుమానం ఉన్న వారికి ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేస్తుందని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఖుషినగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శిల్ప ,సభనాజ్ , అనిల్ ,ప్రశాంత్ మెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.