కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు
కామారెడ్డి,(ఆరోగ్యజ్యోతి); మెదక్ కి చెందిన భూమేష్ 28 సంవత్సరాల యువకుడికి ప్రమాదంలో గాయపడటం తో ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ఎల్లారెడ్డి ఎమ్మార్వో శ్రీనివాస్ రావు వీ.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయడం జరిగిందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలియజేశారు. రక్తదానం చేసిన ఎమ్మార్వో కి కృతజ్ఞతలు తెలియజేశారు గత నాలుగు నెలల కాలంలోనే 250 మందికి సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడమని 15 సంవత్సరాల నుండి దాదాపు 5,000 మందికి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మార్వో దృష్టికి తీసుకురావడం జరిగింది. కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకొని ఎమ్మార్వో అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టెక్నీషియన్ చందన్,చందు, అంజి పాల్గొనడం జరిగింది.