వరంగల్(ఆరోగ్యజ్యోతి): ఛాయా సోషల్ సర్వీస్ సొసైటీ మరియు గర్ల్స్ అడ్వొకేసీ అలియెన్స్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు క్యాంపైన్ ప్రోగ్రాంను తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ సభ్యులతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఛాయా సోషల్ సర్వీస్ సొసైటీ సెక్రటరీ కోట డేవిడ్ మాట్లడడం జరిగింది మానవ అక్రమ రవాణా బిల్లును (2018) భారత పార్లమెంటులో వెంటనే ఆమోదింప చేయాలని డిమాండ్ చేసినారు. భారత దేశ ప్రధాన మంత్రి శ్ నరేంద్ర మోడీ పోస్ట్ కార్డు ద్వారా తెలియా చేయడం జరుగుతుంది అని అయన తెలిపినారు. మానవ అక్రమ రవాణా ఒక హేయమయిన చర్య అని మానవ అభివృదికి గొడ్డలి పెట్టు అన్నారు ఇప్పటివరకు భారత ప్రభుత్వం దేశ రక్షణకు మహిళల రక్షణకు బాలబాలికల సంరక్షణ కొరకు చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో శ్లాఘనీయం అని అభివర్ణించారు. సమాజ అభివృధికి మానవ అక్రమ రవాణా అడ్డుగోడల నిలుస్తుందిఅని ఈ దుర్మార్గపు వ్యవస్థను సమూలంగా నిర్ములించడం కొరకు జరుగబోయే పార్లమెంట్ సమావేశాలలో బిల్లును ఆమోదింప చేసి బాలబాలికల మహిళల జీవితాలను ఆనంద మార్గంలో నడిపించాలని ప్రధాన మంత్రిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడు డివిజన్ ప్రెసిడెంట్ కళ్లేపల్లి సురేష్ , తడిగుప్పుల మల్లేష్ జాగృతి జిల్లా అధ్యక్షుడు మరియు ఈసరం కుమార్ , కొమ్ము వినయ్ డ్రైవర్లు మరియు మాల మహానాడు అధ్యక్షుడు దాసరి శ్యామరాజ్ తాబేటి శ్రీను సంకినేని కృష్ణ రమేష్ తడి తరులు పాల్గొన్నారు.