రిమ్స్ డైరెక్టర్ ని కలిసిన వైద్య ఉద్యోగుల జేఏసీ నేతలు

జేఏసీ ఏర్పాటు చేయడం సంతోషకరం -రిమ్స్ డైరెక్టర్


ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో  సోమవారంనాడు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదిలాబాద్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు డైరెక్టర్ ను  మర్యాదపూర్వకంగా కలిశారు. రిమ్స్ డైరెక్టర్ ను కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ డాక్టర్ మెట్పల్లి శ్రీధర్, కన్వీనర్ బండారి కృష్ణా లు జేఏసీ నాయకులు ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ తో పాటు అన్ని విభాగాలతోపాటు ప్రజా వైద్య కింద పనిచేస్తున్న అన్ని విభాగాలు ఇటీవల జేసీగా ఏర్పాటు చేయడం జరిగిందని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసి చేయాలని అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని డైరెక్టర్ను జేఏసీ నాయకులు కోరారు. సమస్యలు పరిష్కరించడం కోసం తన వంతుగా కృషి చేస్తానని జేసీకి నిరంతర సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని డైరెక్టర్ పేర్కొన్నారు. వైద్య శాఖలో పనిచేస్తున్న ఎస్ఎంసియు ,ఎన్ఆర్,సి పీ పీ యూనిట్, ఆర్ బి ఎస్ కే తదితర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పూర్తి సహాయ సహకారాలు అందించి వారికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఇటీవలరిమ్స్  మైక్రోబయాలజీ విభాగంలో ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగి కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రస్తుతం అయన  హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారని జేఏసీ నాయకులు డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ తో ఫోన్లో మాట్లాడించారు.ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బలరాం నాయక్ మాట్లాడుతూ వైద్య శాఖలో అన్ని సంఘాలు ఒకే గొడుగు కిందికి వచ్చి జేఏసీ ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు రిమ్స్ పరిధిలో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు అభివృద్ధికి సహకరించాలని లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ మాస్కులు, బ్లౌజులు అందించారు ,డైరెక్టర్ ఈ కార్యక్రమంలో జేఏసి కోశాధికారి డాక్టర్ క్రాంతికుమార్. వైస్ చైర్మన్ శ్రీకాంత్, సిడం వామన్,తుల రామకృష్ణ, వర్కింగ్  కమిటీ చైర్మన్ ధనుంజయ ,సలహాదారులు బ్రహ్మానందం రెడ్డి, నాయకులు అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.