- జిల్లా మాతా శిశువు పోషక ఆహర అధికారి డాక్టర్ పద్మశ్రీ
వరంగల్(రూరల్),(ఆరోగ్యజ్యోతి); గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా ప్రతి నెల టీకాలు తీసుకోవడంతో పాటు వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని జిల్లా మాతా శిశువు పోషక ఆహర అధికారి డాక్టర్ పద్మశ్రీ సూచించారు .సోమవారం నాడు వరంగల్ రూరల్ జిల్లా లోని చెన్నారావుపేట సబ్ సెంటర్ లో గర్భిణీలకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామాల్లో .సబ్ సెంటర్లలో ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు గర్భిణీలకు వైద్య పరీక్షలు చేస్తున్నారని అలాగే నెల నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయడంతోపాటు రక్త పరీక్షలు కూడా చేసి మందులను ఉచితంగా అన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ పౌష్టికాహారం తీసుకోవాలని, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి నెల మీ గ్రామంలో కి వచ్చే ఆరోగ్య కార్యకర్త వద్ద మీ పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న అట్లయితే ఆరోగ్య కార్యకర్త కెసిఆర్ కిట్ కొరకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేస్తారని ఆమె తెలిపినారు.కెసిఆర్ కిట్ లో మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే ప్రసవం అయిన తర్వాత కెసిఆర్ కిట్టు ఉచితంగా ఇవ్వడం తో పాటు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వంతులవారిగా లభిస్తుందన్నారు. ప్రసవం అయిన అనంతరం పిల్లలకు పాలు తప్పకుండా పట్టించాలని అన్నారు ఈ ముర్రుపాలు పిల్లలకు శ్రీరామరక్ష అని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ రజిని, ఎం హెచ్ ఎం డి ఓ అర్చన, వైద్యాధికారి డాక్టర్ ఉషారాణి.,సి హెచ్ వో వెంకటేశ్వరరావు. ఏఎన్ఎంలు బోడ అరుణ,రాజకుమారి, పుష్పలత, మంజుల, ఆశా కార్యకర్తలు వసుమతి, మాధవి, విజయ, రేణుక, చెంచులక్ష్మి, ప్రేమలత, స్వరూప, శ్రీలత, అనిత, శ్రీలత,మంజుల తదితరులు పాల్గొన్నారు.