చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

వరంగల్(ఆరోల్గ్యజ్యోతి):  చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంన్ని  10 వ డివిజన్ గవర్నమెంట్ హై స్కూల్ లో మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు . ఈ శిభిరంలో 71 మందికి వైద్యం అందిచడంతో పాటు  ఉచితంగా మందులు పంపిణి చేయడం జరిగింది. లో మెడికల్ హెల్త్ క్యాంపు లో చింతల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్.శ్రీ దేవి తో పాటు  డాక్టర్ రవీందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరంన్ని  నిర్వహిస్తున్న ట్లు  వారు తెలిపినారు. అంటు వ్యాధులు ప్రబలకుండా దోమ తెరలు వాడాలని పరిసర ప్రాంతాలలో నీరు నిల్వకుండా చూడాలని చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో చింతల్ మలేరియా సూపర్వైసోర్ తేజావత్ రవీందర్ , డీ. మోహన్ రావు , మెడికల్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , ఏ.ఎన్.ఎమ్.లు ప్రేమలత , పెనిన్నా , ఆశ వర్కర్లు రవళి , కౌసర్ , మాలని , సబేరాఖనం , తదితరులు పాల్గొన్నారు.